చెర్రీతో మొదలైంది వర్రీ

తాజా వార్తలు

Published : 05/04/2021 21:22 IST

చెర్రీతో మొదలైంది వర్రీ

జపాన్‌: వసంతంలో చెట్లు పచ్చని చిగుళ్లు వేసి, మొగ్గ తొడిగి, పూలు పూయడం ప్రకృతి ధర్మం. అనాదిగా జపనీయులు వసంతకాలంలో విరగబూసిన చెర్రీ పూలను చూసి సంబరాలు చేసుకుంటారు కూడా. కానీ ఈసారి మాత్రం విరగబూసిన ఆ చెర్రీ పూలతో ఇబ్బందే అంటున్నారు పర్యావరణవేత్తలు. 

 వందల ఏళ్ల రికార్డు బద్దలు
లేతగులాబీ, తెలుపు వర్ణాల్లో ఆహ్లాదకరంగా కనిపించే చెర్రీ పూలు జపనీయులకు ఎంతో ఇష్టం. వసంత కాలంలో అక్కడ ఇవి పూయడం సాధారణమే. అయితే పూలు అత్యధికంగా పూసే సమయం మాత్రం ఈసారి ఓ మూడు వారాలు తొందరగా మొదలైంది. సాధారణంగా ఏప్రిల్‌ రెండో వారానికి గానీ ఈ దశ రాదు. అలాంటిది ఇప్పుడు మార్చి 26నే ఇలాంటి పూత దశ వచ్చేసింది. గణాంకాల ప్రకారం చెప్పాలంటే 1200 ఏళ్ల నాటి రికార్డు బద్దలైందంటున్నారు. ఈ ఏడు టోక్యో పరిధిలో మార్చి22 నాటికే చెర్రీ పూలు పూర్తిగా విచ్చుకున్నాయి. క్రీ.శ.812 నుంచి పరిశీలించిన రికార్డుల్లో ఇదే ‘ముందు పూసిన పూత’(ఎర్లీ బ్లోసమ్‌) అని నిర్ధరించారు పర్యావరణ పరిశోధకులు యసుయుకి ఓనో. 

అంతా స్వయంకృతమే
‘ఇంత అందమైన చెర్రీ పూత చూసి సంబరాలు చేసుకోవడం దండగ. ఎందుకంటే ఈ పూతకు కారణం తెలిస్తే దడ పుట్టడం ఖాయం. విపరీతంగా పెరిగిన భూతాపం వల్లే చెర్రీ మొగ్గలు త్వరగా విచ్చుకుంటాయి. ఇది మున్ముందు ఎన్నో విపత్తులకు సూచిక’ అని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుతువులు క్రమం తప్పడం ప్రకృతి వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య చెర్రీ పూలకు మాత్రమే పరిమితం కాదనీ, ప్రకృతిలో రానున్న మరెన్నో విపత్తులకు ఇది ప్రమాద ఘంటిక అని జోస్యం చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని