TS news: రేపట్నుంచి జూడాల నిరసన

తాజా వార్తలు

Published : 22/05/2021 19:01 IST

TS news: రేపట్నుంచి జూడాల నిరసన

హైదరాబాద్‌: కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న జూనియర్‌ వైద్యులు (జూడాలు) నిరసన బాట పడుతున్నట్టు ప్రకటించారు. రేపట్నుంచి ఈ నెల 26 వరకు నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు. తమకు పెంచిన స్టైఫండ్‌, కొవిడ్ విధుల ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రేపట్నుంచి నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటామని తెలిపారు. ఈ నెల 26 తర్వాత విధులు బహిష్కరించనున్నట్టు హెచ్చరించారు. ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్లకు గాంధీ, టిమ్స్‌, కింగ్‌ కోఠి జూనియర్‌ వైద్యులు నోటీసులు ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని