560 మంది అస్తికలను నదిలో కలిపిన మంత్రి

తాజా వార్తలు

Published : 03/06/2021 01:29 IST

560 మంది అస్తికలను నదిలో కలిపిన మంత్రి

బెంగళూరు: మృతిచెందిన వారిని దహనం చేసిన అనంతరం వారి బూడిదను కావేరి నదిలో కలపడం దక్షిణ కర్ణాటకలో సంప్రదాయం. కానీ కరోనా మహమ్మారి అనేక మార్పులకు దారి తీసింది. వ్యాధి సోకి చనిపోయినవారి కొందరి అస్తికలను కుటుంబసభ్యులు భయంతో శ్మశానవాటికల నుంచి తీసుకెళ్లడంలేదు. కాగా ఎవరూ తీసుకెళ్లని, గుర్తుతెలియని వారి అస్తికలను నిమజ్జనం చేసేందుకు పూనుకున్నారు కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక. గురువారం 560 మంది అస్తికలను ఆయన కావేరి నదిలో కలిపారు. ఈసందర్భంగా ఆర్‌.అశోక మాట్లాడుతూ.. ఈ రోజు కావేరిలో అస్తికలను కలుపుతున్నాం. ఈ కార్యాన్ని పవిత్రంగా భావిస్తాం. దీని ద్వారా ఈ 560 మంది స్వర్గానికి చేరుకుంటారు’ అని ఆయన తెలిపారు. 

పలు కారణాలతో కొందరి అస్తికలను కుటుంబసభ్యులు తీసుకోలేకపోయారని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వారి కుటుంబీకులుగానే తాము ఈ కార్యానికి పూనుకున్నట్లు వివరించారు. రెవెన్యూ మంత్రిగా ఇది తన కర్తవ్యమన్నారు. ఉత్తర భారతదేశంలో కనిపించిన కొన్ని దృశ్యాలు ఎంతో బాధను కలిగించాయని మంత్రి తెలిపారు. ‘గంగా నదిలో కరోనా మృతదేహాలు కొట్టుకుపోవడం చూస్తున్నాం. వాటిని కుక్కలు, పక్షులు పీక్కుతింటున్నాయ్‌. ఇది మనకు సిగ్గుచేటు. అందుకే ప్రాణాలు కోల్పోయిన అందరికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని