అరుణాచలంలో వేడుకగా కార్తిక దీపోత్సవం

తాజా వార్తలు

Updated : 29/11/2020 22:21 IST

అరుణాచలంలో వేడుకగా కార్తిక దీపోత్సవం

చెన్నై: తమిళనాడులో పరమశివుడు అరుణ వర్ణ స్వరూపుడై కొలువుదీరిన అరుణాచల క్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఏటా కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమి నాడు అరుణగిరిపై పరమశివుడు అఖండ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో ఆదివారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యక్షేత్రంలో స్వామి వారి ఊరేగింపును దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ఈ సందర్భంగా అరుణాచల కొండలు పరమశివుడి నామస్మరణతో మారుమ్రోగాయి. అఖండ జ్యోతి రూపంలో పరమశివుడిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.

ఇదీ చదవండి

జ్ఞానం శిలలుగా.. భక్తి నెలవుగా.. అరుణాచలం
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని