భక్తిశ్రద్ధలతో కార్తిక సోమవారం పూజలు
close

తాజా వార్తలు

Published : 14/12/2020 09:58 IST

భక్తిశ్రద్ధలతో కార్తిక సోమవారం పూజలు

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. ప్రముఖ శైవక్షేత్రాలు శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ, వేయి స్తంభాలగుడి, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తుల శివనామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు. అనంతరం పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భద్రాచలం గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తిక దీపాలు వదిలారు. గోదావరి ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో దీపాలు వెలిగించారు.

కార్తికమాసం చివరిరోజు కావడంతో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద సాయంత్రం లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని