కేసీఆర్‌, జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

తాజా వార్తలు

Published : 13/05/2021 17:15 IST

కేసీఆర్‌, జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో గంగాజమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ప్రతీక అని చెప్పారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని... గుణాత్మక ఫలితాలు ఇస్తున్నాయని కేసీఆర్ అన్నారు.

అల్లా దీవెనలతో ప్రపంచ మానవాళికి శుభాలు కలగాలని ఏపీ సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రజలు కరోనా నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ అని చెప్పారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే రంజాన్‌ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొంటారన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని