పది ఫెయిలయ్యారా.. కొడైకెనాల్‌ ట్రిప్‌ ఫ్రీ..

తాజా వార్తలు

Published : 17/07/2021 19:42 IST

పది ఫెయిలయ్యారా.. కొడైకెనాల్‌ ట్రిప్‌ ఫ్రీ..

విద్యార్థులకు వ్యాపారవేత్త ఆఫర్‌

చెన్నై: తమిళనాడులోని పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌లో నివసిస్తున్న సుధీర్‌ అనే వ్యాపారవేత్త.. పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కేరళ ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు రెండు రోజులపాటు కొడైకెనాల్‌ ట్రిప్‌ను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. అతి సుందరమైన కొడైకెనాల్‌ను చుట్టేస్తూ రెండురోజులపాటు కొండ ప్రాంతంలో ఉన్న తమ ఇళ్లల్లో సేదతీరవచ్చని పేర్కొన్నారు.

కేరళలోని కొయ్‌కోడ్‌ ప్రాంతానికి చెందిన కె.సుధీర్‌ 2006 నుంచి కుటుంబంతో సహా కొడైకెనాల్‌లో నివసిస్తున్నారు. అక్కడే కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌ మాట్లాడుతూ.. ‘పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సంబరాలు చేసుకుంటారు. కుటుంబీకులు, బంధువులు వారిని ప్రశంసిస్తూ ఉంటారు. కానీ అదే పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల పరిస్థితి ఆలోచించండి. వారు కుంగిపోతూ ఉంటారు. తీవ్ర వేదనకు గురౌతుంటారు. వారిలో ఉత్తేజాన్ని నింపేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నా’ అని సుధీర్‌ పేర్కొన్నారు. 

ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్న సుధీర్‌ ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనేక మంది ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన పరీక్షల్లో ఫెయిలైనవారికే ఈ ఆఫర్‌ ఉందా? లేక గతంలో పరీక్షల్లో తప్పినవారికి కూడా అవకాశం ఉందా అని అడుగుతున్నారు. దీనిపై స్పందించిన సుధీర్‌.. కేరళ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఫెయిలైన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫెయిలైనట్లు తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని వచ్చేప్పుడు వెంటతీసుకురావాలని సూచించారు. జులై 14వ తేదీన కేరళ విద్యాశాఖ పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని