నారాయణపేటలో అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం

తాజా వార్తలు

Updated : 10/07/2021 13:32 IST

నారాయణపేటలో అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం

నారాయణపేట: నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణపేట జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్‌.. 10 గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రిలో సకల సదుపాయాలతో సిద్ధం చేసిన చిన్నపిల్లల వార్డును కేటీఆర్‌ ప్రారంభించారు. పట్టణంలోని బస్ డిపో ఎదురుగా రూ.6 కోట్లతో చేపడుతున్న వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అమరవీరుల స్తూపం పనులను ప్రారంభించారు. అనంతరం సింగారం క్రాస్‌ రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం.. అంబేడ్కర్ చౌరస్తా పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత పిల్లల పార్కు, సైన్స్‌ పార్కులను ప్రారంభించారు.

కేటీఆర్‌ కాన్వాయ్‌ అడ్డగింత

కేటీఆర్‌ క్వాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల ఐసీయూ వార్డు ప్రారంభానికి వెళుతున్న క్రమంలో ఏబీబీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. నారాయణపేటకు పీజీ కళాశాల మంజూరు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులు నియంత్రణ చేయాలంటూ నినాదాలు చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన చేస్తున్న కార్యకర్తలను చెదరగొట్టారు. కొందరిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని