KTR: హరితహారాన్ని మించింది లేదు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 01/07/2021 14:20 IST

KTR: హరితహారాన్ని మించింది లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: హరితహారాన్ని మించిన ఉదాత్త, గొప్ప కార్యక్రమం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌ కోసం పుడమిని కాపాడుకునేందుకు సమష్టిగా పని చేయాలని చెప్పారు. తెలంగాణలో ఏడో విడత హరితహారం ప్రారంభమైన నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ కలాన్ వద్ద నిర్వహించిన కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రిజర్వ్‌ పార్క్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటిన ఆయన మాట్లాడారు. కరోనా రెండో దశలో దేశం అంతా తల్లడిల్లిపోయిందన్నారు. ఆక్సిజన్‌ అందక ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందని చెప్పారు.

‘‘హరితహారం ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం. రూ.5,900 కోట్లతో 220 కోట్ల మొక్కలు నాటేలా కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్రంలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 129 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు అభివృద్ధి చేశాం. హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు ఏర్పాటు చేశాం. ప్రాణవాయువును అందించడంలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు కీలకపాత్ర పోషిస్తాయి’’ అని కేటీఆర్‌ అన్నారు. అంతకముందు మంత్రులు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని