ఆమీర్‌పై భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

తాజా వార్తలు

Updated : 12/07/2021 18:39 IST

ఆమీర్‌పై భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

భోపాల్‌: దేశంలో జనాభా అసమానతలకు ఆమీర్‌ఖాన్‌ లాంటి వాళ్లే కారణమని మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం విలేకరుల సమావేశంలో మాండ్సౌర్‌ ఎంపీ సుధీర్‌ గుప్తా మాట్లాడారు. ‘భారత భూభాగం ఒక అంగుళం కూడా పెరగలేదు. కానీ, జనాభా మాత్రం 140 కోట్లకు చేరువైంది. విభజన సమయంలో పాకిస్థాన్‌కు చాలా ఎక్కువ భూమి వెళ్లిపోయింది. కానీ జనాలు తక్కువ సంఖ్యలో వెళ్లారు. అందులో కొందరు తిరిగి భారత్‌కే వచ్చారు. ఇందుకు అనుగుణంగా భారత భూభాగం మాత్రం పెరగలేదు’ అని పేర్కొన్నారు.

ఈ మధ్యే భార్య కిరణ్‌రావు నుంచి విడాకులు తీసుకున్న బాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ గురించి ప్రస్తావించారు. ‘ప్రజల హీరో అయిన ఆమీర్‌ఖాన్‌ తన మొదటి భార్య రీనాతోపాటు వారి సంతానాన్ని, రెండో భార్య కిరణ్‌రావుతోపాటు వారి కుమారుడిని వదిలేశాడు. ఇప్పుడు మూడో భార్య కోసం ఆరాటపడుతున్నాడు’ అని వ్యాఖ్యానించారు. దేశ జనాభా అసమానతల్లో ఆమీర్‌ఖాన్‌ లాంటి వ్యక్తులు పాత్ర పోషించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని