హారతిస్తే చిరునవ్వులు చిందించే శ్రీమహావిష్ణువు

తాజా వార్తలు

Updated : 29/01/2021 17:57 IST

హారతిస్తే చిరునవ్వులు చిందించే శ్రీమహావిష్ణువు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఇందుగలడందులేడని.. సందేహం వలదు..’... ‘ఎందెందు వెదకి చూసినా అందందే గలడు’ అన్నట్లుగా ఆ సేతు హిమాచలం ఆధ్యాత్మిక శోభకీ, వైభవానికీ నెలవు.  సనాతన ధర్మాన్నీ, సంప్రదాయాలనూ భావితరాలకు తెలియజెప్పేందుకు పూర్వీకులు ఎన్నో అద్భుతమైన కట్టడాలనూ, దేవతా ప్రతిమలనూ మనకు అందించారు.  అలాంటి దివ్య సుందర కళాకృతుల్లో ఈ శ్రీ మహా విష్ణువు విగ్రహం ఒకటి. 

ఐదు వేల సంవత్సరాల నాటి విగ్రహంగా చెబుతున్న దీనికి ఓ ప్రత్యేకత ఉంది. హారతి ఇచ్చే సమయంలో వైకుంఠ వాసుని విగ్రహంలో చిరు మందహాసం గోచరిస్తుంది.  మరీ ముఖ్యంగా హారతిని పైకి తీసుకెళ్లినప్పుడు విగ్రహంలోని మూర్తి చిరునవ్వులు చిందిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. మన భారతీయ కళాకారుల ప్రతిభకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. ఆ అద్భుతమైన సుందర దృశ్యాన్ని మీరూ వీక్షించండి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని