విశాఖలో ‘ఉక్కు’ కోసం మహాకవాతు

తాజా వార్తలు

Updated : 04/04/2021 19:15 IST

విశాఖలో ‘ఉక్కు’ కోసం మహాకవాతు

ఈనాడు డిజిటల్‌, విశాఖ: విశాఖ సాగర తీరాన కార్మిక సంఘాలు కదం తొక్కాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పిడికిలి బిగించి ఆదివారం ‘మహా కవాతు’ చేపట్టాయి. ఈ కవాతులో సుమారు 2 వేల మంది అఖిలపక్ష కార్మిక, నిర్వాసిత సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. విశాఖ ఆర్‌కే బీచ్‌ నుంచి ఇవాళ మధ్యాహ్నం మొదలుపెట్టిన ఈ మహాకవాతు బీచ్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు సాగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆపేది లేదని పలువురు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘మహాసభ’ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా కవాతు నిర్వహించినట్లు చెప్పారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని