రెండు మేకలు.. ధర ₹4.5లక్షలు!

తాజా వార్తలు

Published : 21/07/2021 01:07 IST

రెండు మేకలు.. ధర ₹4.5లక్షలు!

లఖ్‌నవూ: మేక మాంసం కాస్త ఖరీదు ఎక్కువ. ప్రాంతాలను బట్టి.. కేజీకి రూ. 700కుపైగా పలుకుతుంటుంది. ఇక మేకను మొత్తంగా కొనుగోలు చేస్తే ధర రూ.వేలల్లోనే ఉంటుంది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు మేకలు ఏకంగా రూ.4.5లక్షలకు అమ్ముడుపోయాయి. బక్రీద్‌ సందర్భంగా ఓ వ్యక్తి లఖ్‌నవూలోని గోమతి నది సమీపంలో ఉన్న మేకల మార్కెట్లో వీటిని కొనుగోలు చేశాడు. కండలు తిరిగి బలిష్టంగా ఉన్న ఈ మేకల్లో ఒకటి 170కిలోలు ఉండగా.. మరొకటి 150 కిలోలు ఉంటుందట. రెండు సంవత్సరాల వయసున్న ఈ మేకలను రోజూ బాదం, కాజు, స్వీట్లు, జ్యూస్‌లు ఆహారంగా పెట్టి పెంచినట్లు విక్రయదారులు వెల్లడించారు. ఇందుకోసం రోజుకు రూ.600ఖర్చు చేసినట్లు తెలిపారు.

బక్రీద్‌ నేపథ్యంలో మేకల మార్కెట్లు కిటకిటలాడాయి. లఖ్‌నవూలోని కుడియా మేకల మార్కెట్‌ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. అయితే, కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా పెద్దసంఖ్యలో ప్రజలు మార్కెట్లోకి రావడంతో కరోనా వ్యాప్తికి అవకాశముందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని