శునకం కడుపులో మాస్కు.. బయటకు తీసిన వైద్యులు

తాజా వార్తలు

Published : 14/06/2021 01:40 IST

శునకం కడుపులో మాస్కు.. బయటకు తీసిన వైద్యులు

చెన్నై: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించడం ఈ రోజుల్లో సాధారణం అయిపోయింది. భారత్‌లో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు మాస్కులు ధరించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ వాటిని వాడి ఎక్కడబడితే అక్కడ పడేయడం మూగజీవాల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. ఇటీవల చెన్నైలో ఓ పెంపుడు శునకానికి తలెత్తిన ఇబ్బందితో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. 

తమిళనాడుకు చెందిన కొందరు వెటర్నరీ వైద్యులు సైబీరియన్‌ జాతికి చెందిన ఓ పెంపుడు శునకం కడుపులోంచి మాస్కును వెలికి తీస్తున్న వీడియో ఇటీవల బయటికొచ్చింది. ఆ వీడియోను సుప్రియ సాహు అనే ఐఏఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘మనం నిర్లక్ష్యంగా విసిరి పారేస్తున్న మాస్కులు మూగజీవాలకు ప్రాణహాని కలిగించే అవకాశం ఉంది. చెన్నైలోని వెటర్నరీ, పశు వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య బృందం సైబీరియన్‌ హస్కీ కడుపులోంచి మాస్కును విజయవంతంగా బయటికి తీసింది. దయచేసి ఇప్పటినుంచైనా వ్యర్థాలను నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు’’ అని ట్వీట్‌ చేశారు. చాలామంది నెటిజన్లను ఈ వీడియో కలవరపాటుకు గురిచేసింది. ఇక నుంచి వినియోగించిన మాస్కులను బయట పడేసేటప్పుడు జాగ్రత్త వహించాలంటూ సూచించారు. శునకాన్ని కాపాడిన వైద్యులకు ట్విటర్‌ వేదికగా పలువురు అభినందనలు తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని