‘‘Corona కట్టడికి ప్రణాళికలు రచిస్తున్నాం’’

తాజా వార్తలు

Updated : 08/05/2021 13:48 IST

‘‘Corona కట్టడికి ప్రణాళికలు రచిస్తున్నాం’’

ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని

తిరుపతి: కరోనా బాధితులకు ఆక్సిజన్‌, పడకల కొరత రాకుండా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో కరోనా పరిస్థితులపై ఇవాళ తిరుపతి ఎస్వీ వర్సీటీలో ఉన్నతాధికారులు, వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 500 టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే రాష్ట్రానికి ఇస్తోందని మంత్రి తెలిపారు. అందులో 40 టన్నులు చిత్తూరుకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లు పెంచితే ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని సమీక్షలో చర్చించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. 

స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లభ్యతపై సమీక్షలో చర్చించామని మంత్రి తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందని.. కేంద్రం నుంచి వస్తున్న టీకాలను అదే రోజు ప్రజలకు అందేలా చూస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో  50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని