టీవీ రంగాన్ని ప్రభుత్వం విస్మరించదు: ఈటల

తాజా వార్తలు

Published : 15/02/2021 01:20 IST

టీవీ రంగాన్ని ప్రభుత్వం విస్మరించదు: ఈటల

హైదరాబాద్‌: కోట్లాది మంది ప్రజలకు వినోదాన్ని పంచుతున్న తెలుగు టెలివిజన్‌ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలుగు టెలివిజన్‌ పరిశ్రమలో అర్హులైన కార్మికులందరికీ రేషన్‌, ఆరోగ్య కార్డులను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హామీ ఇచ్చారు. టీవీ రంగంలోని పేదలందరికీ సర్కార్‌ అండగా ఉంటుందన్నారు. కార్మికుల డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగు టెలివిజన్‌ ఆవిర్భవించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రథమ నివేదన సభను ఏర్పాటు చేశారు. టీవీ రంగానికి సంబంధించిన 22 యూనియన్ల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాగబాల సురేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి ఈటలతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ టీవీ కార్మికుల కష్టాలను ప్రభుత్వానికి నివేదించారు. 

టెలివిజన్‌ కార్మికుల నివేదనపై మంత్రి ఈటల స్పందించారు. టెలివిజన్‌ రంగాన్ని ప్రభుత్వం ఎప్పుడూ చిన్నచూపు చూడదని తెలిపారు. త్వరలోనే టీవీ నగర్‌తో పాటు పేదల తరహాలోనే రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీవీ రంగాన్ని చిన్న పరిశ్రమగా చూడడం లేదని.. ప్రభుత్వాల అవసరం చిన్నవారికే ఉంటుందన్నారు. టెలివిజన్‌ కళాకారులతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి..

హైదరాబాద్‌ చేరుకున్న అరకు ప్రమాద మృతులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని