వారంతా విధిగా టీకా వేసుకోవాలి: ఈటల

తాజా వార్తలు

Published : 01/04/2021 15:56 IST

వారంతా విధిగా టీకా వేసుకోవాలి: ఈటల

హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటివరకు వైద్య కళాశాలలు, టీవీవీపీ ఆస్పత్రుల్లోనే టీకాలు వేశామని.. నేటి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లు నిండిన వారందరికీ టీకా వేస్తున్నారని.. వారంతా విధిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ద్వారానే కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోగలమన్నారు. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాలించాలని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని