మొదటగా 2.90లక్షల మందికి టీకా: ఈటల

తాజా వార్తలు

Published : 10/01/2021 01:46 IST

మొదటగా 2.90లక్షల మందికి టీకా: ఈటల

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా టీకా తయారవడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌ చందానగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో నిర్వహించిన కొవిద్ డ్రైరన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ఈటల ప్రారంభించారు. ఆస్పత్రి వైద్యులు, అక్కడే వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై చేపట్టిన డ్రైరన్‌ను ఈటల పరిశీలించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయన్నారు. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిపి మొదటగా 2.90 లక్షల మందికి టీకా అందించనున్నట్లు ఈటల వెల్లడించారు. 800పైగా కేంద్రాల్లో వివిడ్-19 టీకా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సైతం డ్రైరన్ నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. 50 ఏళ్లు పైబడిన వారు, చిన్న పిల్లలకు టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఇవీ చదవండి..

తొలి వ్యాక్సిన్‌ నేనే తీసుకుంటా: ఈటల

ఇండోనేషియాలో విమానం అదృశ్యం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని