అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 06/07/2021 14:42 IST

అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: నిరసనల్లో భాగంగా సిలిండర్లు, ద్విచక్రవాహనాలు చెరువుల్లో పడేయటంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు నిరసనలు అనేవి ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమన్నారు. కానీ, చెరువుల్లో సిలిండర్లు, ద్విచక్రవాహనాలు పడేయటం లాంటి చర్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు కొందరు పెట్రోలు ధరల పెరుగుదలపై నిరసనలు తెలుపుతూ ఒక ద్విచక్రవాహనాన్ని ట్యాంక్‌బండ్‌లో పడేశారు. గ్యాస్ ధర రూ.25 పెంపును వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలో భాగంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ కార్యకర్తలు సిలిండర్‌ను వేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌.. అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్వీట్‌కు జతచేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని