కరోనా వేళ స్వచ్ఛత అవసరం: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 25/03/2021 12:58 IST

కరోనా వేళ స్వచ్ఛత అవసరం: కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ స్వచ్ఛత చాలా అవసరమని పురపాలక మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఈ ఉదయం 325 స్వచ్ఛ ఆటోలను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను చెత్తకుండీలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. స్వచ్ఛ నగర నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు ప్రజలకు బాధ్యత ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

మహానగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చెత్త సేకరణకు 650 కొత్త స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసింది. మొదటి విడతగా ఇవాళ 325 ఆటోలను కేటీఆర్‌ ప్రారంభించారు. ఇప్పటికే నగరంలో 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరగుతోంది. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, మంత్రి తలసాని తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని