TS News: మున్సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 07/06/2021 16:35 IST

TS News: మున్సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు: కేటీఆర్‌

మెట్‌పల్లి: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో రూ.500కోట్లతో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనికోసం రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో రూ.500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మెట్‌పల్లిలో రూ.2.50కోట్లతో ఏర్పాటు చేయనున్న వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం కింద నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా ఠంఛనుగా రూ.148కోట్ల నిధులు మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. 

వచ్చే ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్‌ తరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాలు, పల్లెల్లో ప్రజారోగ్యం కోసం శ్రద్ధ చూపెడుతోందని చెప్పారు. గత 65 ఏళ్లలో అప్పటి ప్రభుత్వాలన్నీ కలిపి రాష్ట్రంలో 4 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశాయని.. తెరాస అధికారంలోకి వచ్చిన తొలి నాలుగున్నరేళ్లలోనే 5 వైద్య కళాశాలలు ప్రారంభించామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా మరో 7 మంజూరు చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని