ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 24/06/2021 20:30 IST

ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కేటీఆర్‌

జీహెచ్‌ఎంసీ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి సమీక్ష

హైదరాబాద్: వర్షాకాలం కోసం రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పని చేయాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) యంత్రాంగాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. వర్షాకాల సన్నద్ధత, నాలాల పనులు, సంబంధిత అంశాలపై సమీక్షించారు. గత కొన్నేళ్లుగా నగరంలో తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈసారి మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు గ్రేటర్ లోని వివిధ విభాగాలు సమన్వయంతో ముందుకు పోయేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.

‘‘నాలాల అభివృద్ది కోసం ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేశాం. వాటిపై క్యాపింగ్, ఫెన్సింగ్ వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలి. వివిధ జోన్లలో నాలాల అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను జీహెచ్ఎంసీ ద్వారా అందిస్తాం. నాలాలకు సంబంధించిన పనులను మేయర్, జోనల్‌ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లపై జరిపిన తవ్వకాల వద్ద అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. ఈ మేరకు గుత్తేదార్లు, ఆయా శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి. ఇందుకోసం వైద్యారోగ్య, పారిశుద్ధ్య విభాగాలు కలిసి పని చేయాలి. జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలను చేపట్టాలి. దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్, యాంటీ లార్వా వంటి కార్యక్రమాలను ఎంటమాలజీ విభాగం మరింత పెంచాలి’’ అని కేటీఆర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని