నగదు ఎలుకలు కొట్టేసిన బాధితుడికి మంత్రి హామీ

తాజా వార్తలు

Updated : 18/07/2021 12:53 IST

నగదు ఎలుకలు కొట్టేసిన బాధితుడికి మంత్రి హామీ

హైదరాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వృద్ధుడు శస్త్రచికిత్స కోసం దాచుకున్న డబ్బును ఎలుకలు కొరికేసిన ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. రైతుకు మెరుగైన వైద్యం, డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ మండలం వేంనూరు శివారు ఇందిరానగర్‌ కాలనీ తండాకు చెందిన భూక్య రెడ్యా కడుపులో కణితి రావడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది. అందుకు రూ.4 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. కూరగాయల వ్యాపారం చేసి కూడబెట్టిన దాంతో పాటు, అప్పుగా తీసుకొచ్చిన మొత్తం రూ.2 లక్షలను ఇంట్లో బీరువాలో ఉంచారాయన.

ఆసుపత్రికి వెళ్దామని మంగళవారం బీరువాను తెరిచి చూసిన రెడ్యాకు నోట్లన్నీ చిరిగిపోయి కనిపించాయి. ఎలుకలు కొట్టేసిన డబ్బుతో నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఆ డబ్బులు చెల్లవని.. హైదరాబాద్‌లోని రిజర్వ్‌ బ్యాంకును సంప్రదించాలని.. అక్కడ కూడా తీసుకుంటారో లేదోనన్న సందేహం వ్యక్తం చేయడంతో రెడ్యా భోరున విలపించారు. తనకు సాయం చేయాలని వేడుకున్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని