GHMC: నాలాలకు శాశ్వత పరిష్కారం: తలసాని

తాజా వార్తలు

Updated : 11/06/2021 16:37 IST

GHMC: నాలాలకు శాశ్వత పరిష్కారం: తలసాని

వర్షాకాల సన్నద్ధతపై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని నాలాలపై అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. వర్షాకాల సన్నద్ధతపై మంత్రి మహమూద్‌ అలీతో కలిసి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. 1,360 కిలోమీటర్ల మేర రూ.45 కోట్ల వ్యయంతో ఏటా నాలాల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పూడికతీత కోసం త్వరలోనే యంత్రాలు సమకూర్చుతామని వెల్లడించారు. కొన్ని చోట్ల నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు. ఈ క్రమంలో నివాసాలు కోల్పోతున్నవారికి పునరావాసం కల్పిస్తామని.. చెరువుల ఆక్రమణలు తొలగిస్తామని వివరించారు. నగరంలో సాధ్యమైనంత వరకు ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎల్‌బీనగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా చేశామని.. త్వరలోనే ఉప్పల్‌ రింగు రోడ్డు వద్ద ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాల సన్నద్ధతలో భాగంగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తలసాని సూచించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని