గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే

తాజా వార్తలు

Updated : 09/03/2021 13:21 IST

గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే

రాంచీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ రాంచీలోని అసెంబ్లీ భవనం వద్దకు చేరుకున్నారు. ఈ అశ్వాన్ని మాజీ కర్నల్‌ రవి రాఠోర్‌ తనకు కానుకగా ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమకు తాము తక్కువగా చూసుకోరాదన్నారు. తమలో ఉన్న శక్తిని గుర్తించాలని పిలుపునిచ్చారు. వనితలు అన్ని అడ్డంకుల్ని అధిగమించి తమ కలల్ని సాకారం చేసుకొనే దిశగా ముందుకు సాగాలన్నారు.  31 ఏళ్ల అంబా ప్రసాద్‌ రాంగఢ్‌ జిల్లాలోని బర్కగాన్‌ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరోవైపు, మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అంబా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్టులో భాగంగా 115 మంది పేద వితంతువులకు నెలకు రూ.9వేలు వచ్చేలా స్థానికంగా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని