Krishnapatnam: ఎంపీ వద్ద ఆనందయ్య మందు!

తాజా వార్తలు

Updated : 28/05/2021 19:16 IST

Krishnapatnam: ఎంపీ వద్ద ఆనందయ్య మందు!

ఒంగోలు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఔషధాన్ని రహస్యంగా తయారు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద మందు పొట్లాలు ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షలో పాల్గొన్న ఎంపీ.. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు విశ్వరూప్‌, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డికి ఆనందయ్య ఔషధ పొట్లాలను అందజేశారు.

మరోవైపు, కరోనా నివారణకు తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ వ్యాపించిన వదంతులన్నీ అవాస్తవమన్నారు. వీటిని నమ్మిఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు కూడా సిద్ధంగాలేవన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని