Raghurama: వైద్యపరీక్షల ఆలస్యంపై కుటుంబసభ్యుల ఆందోళన

తాజా వార్తలు

Updated : 16/05/2021 14:22 IST

Raghurama: వైద్యపరీక్షల ఆలస్యంపై కుటుంబసభ్యుల ఆందోళన

గుంటూరు: వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ కాళ్ల‌కు అయిన గాయాల‌పై జీజీహెచ్‌లో వైద్య‌ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. గుంటూరులోని సీఐడీ కార్యాల‌యంలో త‌న‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కొట్టార‌ని నిన్న ర‌ఘురామ సీఐడీ కోర్టు న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు ఇదే విష‌యాన్ని హైకోర్టుకు నివేదించారు. ఈ ఉద‌యం 10.30 లోపు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేదిక ఇవ్వాల‌ని జిల్లా కోర్టు, మ‌ధ్యాహ్నం 12 గంటలలోపు ఇవ్వాల‌ని హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఆదేశించినా నివేదిక‌లో జాప్యం చోటు చేసుకుంది. మెడిక‌ల్ బోర్డు నివేదిక కోసం జిల్లా కోర్టు వేచి చూస్తోంది. వైద్య ప‌రీక్షల ఆల‌స్యంపై ఎంపీ కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌ వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఎంపీని ర‌మేశ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్య‌ప‌రీక్ష‌లు చేయించాల‌ని కోర్టు నిన్న ఆదేశించింది. ప్ర‌భుత్వాసుప‌త్రిలోనే వైద్య‌ప‌రీక్ష‌లు ముగియ‌క‌పోవ‌డంతో అక్క‌డికి ఎప్పుడు త‌ర‌లిస్తార‌నే దానిపై స్ప‌ష్ట‌త లేదు. 

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠకు భంగం క‌లిగించేలా వ్యాఖ్య‌లు చేశార‌ని ఎంపీ ర‌ఘురామ‌ను రెండు రోజుల కింద‌ట సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ వేయ‌గా.. కింది కోర్టుకు వెళ్ల‌మ‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం సూచించింది. జిల్లా కోర్టు ఈనెల 28 వ‌ర‌కు రిమాండ్ విధించ‌డంతో.. ఎంపీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఇవాళ విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని