నా అందమైన నవ్వుల వెనుక ఉన్నది డాక్టర్‌ మోహన్‌: నాగార్జున

తాజా వార్తలు

Updated : 18/10/2021 13:46 IST

నా అందమైన నవ్వుల వెనుక ఉన్నది డాక్టర్‌ మోహన్‌: నాగార్జున

హైదరాబాద్‌: సినీ తారలకు మెరిసే దంతాలు ఎంతో అవసరమని, ఎన్నో ఏళ్లుగా తన నవ్వుల్ని దంత వైద్యుడు డాక్టర్‌ అట్లూరి మోహన్‌ అందంగా ఉంచుతున్నారని సినీ నటుడు నాగార్జున అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్‌ మోహన్‌ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన, సాయి డెంటల్‌ క్లినిక్‌ నూతన శాఖను సతీమణి అమలతో కలిసి నాగార్జున ప్రారంభించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ‘నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు సుల్తాన్‌బజార్‌లో ఉండే వైద్యులు ఎం.ఎస్‌.నారాయణను సంప్రదించేవాడిని. ఆ తర్వాత ఆయన కుమారుడు మోహనే నాతో పాటు, వందల మంది సినీ నటులకు దంత వైద్యునిగా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలకు సేవల్ని విస్తరించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

తమ కుటుంబం ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేందుకు డాక్టర్‌ మోహన్‌ చూసుకుంటారని అమల తెలిపారు. అనంతరం డాక్టర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. భవిష్యత్‌ మొత్తం డిజిటల్‌ డెంటిస్రీదేనని ఒక్కసారి ఆస్పత్రిని సందర్శిస్తే అధునాత సాంకేతికత ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చికిత్స అందుతుందన్నారు. వేల మందికి అందమైన చిరునవ్వులందించే బాధ్యత గత 55ఏళ్లుగా తాము చేపడుతున్నామని మోహన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని