ఇల్లు కట్టుకోవాలా.. మొక్క నాటాల్సిందే..!

తాజా వార్తలు

Updated : 05/06/2021 23:22 IST

ఇల్లు కట్టుకోవాలా.. మొక్క నాటాల్సిందే..!

భోపాల్‌: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఇకపై రాష్ట్రంలో భవన నిర్మాణానికి అనుమతులు రావాలంటే కనీసం ఒక మొక్క నాటడం తప్పనిసరి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఓ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇల్లు, పార్కు, పాఠశాల, పంచాయతీ భవనాలు లాంటి ప్రాంతాల సమీపంలో ఎక్కడైనా మొక్క నాటవచ్చని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిర్మించే గృహాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని