వధువు-వరుడు జంటగా జంప్‌

తాజా వార్తలు

Updated : 19/07/2021 20:29 IST

వధువు-వరుడు జంటగా జంప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తాళి కట్టే వేళ పెళ్లికూతురు వెళ్లిపోయిందని చాలాసార్లు విన్నాం. పెళ్లి పీటల మీద నుంచి వరుడు కనిపించకుండా పోయిన సన్నివేశం ఎన్నోసార్లు చూశాం. కానీ, చిత్రంగా పెళ్లి పీటల నుంచి వధువు-వరుడు ఇద్దరు కలిసి పారిపోయిన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇంతకీ వాళ్లిద్దరికి వచ్చిన కష్టం ఏంటంటే.. కొవిడ్‌-19 నిబంధనలు పాటించడం లేదనీ, అతిథులు ఎక్కువగా వచ్చారని పోలీసులు ఆ పెళ్లిలో చేసిన హడావుడినే. పోలీసులు ప్రశ్నలతో హింసిస్తారనీ, కేసు నమోదు చేస్తారనే భయంతోనే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇలా వెళ్లిపోయారని బంధువులు చెబుతున్నారు. ఈ చిత్రమైన సంఘటన బాలాసోర్‌ జిల్లాలోని చాపులియా చౌక్‌లో చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఒడిశా పోలీసులు పెళ్లికి యాభై మందికి మంచి హాజరు కాకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ పెళ్లికి దాదాపు 200 మందికిపైగా అతిథులు వచ్చినట్టు సమాచారం. ముహుర్తానికి ముందే కనిపించకుండా పోయిన ఆ పడుచు జంట ఆచూకీ ఇప్పటికీ తెలియరావడం లేదట.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని