Mango: ఒక్కో మామిడి పండు రూ.1,000

తాజా వార్తలు

Updated : 07/06/2021 11:08 IST

Mango: ఒక్కో మామిడి పండు రూ.1,000

అలీరాజాపూర్‌(మధ్యప్రదేశ్‌): పండ్లలో రారాజుగా పిలిచే మామిడి.. ధర పలికితే రైతునూ రాజును చేయగలదు. బంగినపల్లి, నీలం, తోతాపురి ఇలా అనేక రకాల్లో లభించే ఈ పండుకు సీజన్‌లో ఉండే క్రేజే వేరు. అయితే, వీటన్నింటిలో కెల్లా మధ్యప్రదేశ్‌లోని అలీరాజాపూర్‌ జిల్లాలో లభించే ‘నూర్జహాన్’ వెరైటీకి ఉన్న  ప్రత్యేకత అంతాఇంతా కాదు. పూత దశలో ఉండగానే.. అనేక మంది వీటిని బుక్‌ చేసుకుంటుంటారు. అంతటి క్రేజ్‌ దీని సొంతం.

ఈసారి వాతావరణం అనుకూలించడంలో దిగుబడి బాగా వచ్చిందని నూర్జహాన్‌ను పండించే రైతులు చెబుతున్నారు. ఒక్కో కాయ మూడు కిలోల వరకు తూగుతున్నట్లు తెలిపారు. గత ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక్కో పండు బరువు 2.5 కిలోల వరకే పరిమితమైనట్లు రైతులు తెలిపారు. పైగా కరోనా ప్రభావంతో 2020 వేసవిలో పెద్దగా డబ్బులేమీ రాలేదని వాపోయారు. కానీ, ఈసారి మాత్రం మార్కెట్‌లో నూర్జహాన్‌ పండుకు మంచి డిమాండ్‌ ఉన్నట్లు రైతులు తెలిపారు. ఒక్కో పండును రూ.1000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో దీని ధర రూ.1,200 వరకు పలకడం గమనార్హం.

జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూతకు పూస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయి. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగు మేర పొడువు ఉంటాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని