గాంధీలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నిరవధిక సమ్మె

తాజా వార్తలు

Published : 15/07/2020 11:20 IST

గాంధీలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నిరవధిక సమ్మె

హైదరాబాద్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్దీకరణ సహా వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి పొరుగుసేవల సిబ్బంది గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులను కాపాడుతున్నా సరైన వేతనాలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఔట్‌సోర్సింగ్‌ నర్సులు, పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఓపీ, ఇతర వార్డుల్లో రోగులకు సేవల్లో అంతరాయమేర్పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని