గాంధీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమ్మె విరమణ

తాజా వార్తలు

Published : 15/07/2020 17:30 IST

గాంధీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమ్మె విరమణ

హైదరాబాద్‌: జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో సమ్మెకు దిగిన గాంధీ ఆస్పత్రిలోని పొరుగు సేవల సిబ్బంది ఆందోళన విరమించారు. గత రెండు రోజులుగా వీరు ఆందోళన చేపట్టారు. ఇవాళ ఉదయం నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డీఎంఈ రమేశ్‌ రెడ్డితో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. షిఫ్టుల వారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. కొవిడ్‌-19 విధుల్లో ఉన్న వారికి రోజుకు రూ.300 చొప్పున అదనపు భత్యం ఇచ్చేందుకు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఔట్‌సోర్సింగ్‌ నర్సులు, పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టిన వారిలో ఉన్నారు. వీరి ఆందోళనతో గాంధీలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని