Oxygen Express: ఏపీకి బయల్దేరింది!

తాజా వార్తలు

Updated : 14/05/2021 16:51 IST

Oxygen Express: ఏపీకి బయల్దేరింది!

విశాఖపట్నం: రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు తొలిసారిగా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రానుంది. పశ్చిమ్‌బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ప్లాంట్‌ నుంచి నుంచి 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొని ఏపీకి బయల్దేరింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఆక్సిజన్‌ను విశాఖపట్నం, నెల్లూరులో స్టేషన్లలో అన్‌లోడ్ చేయనున్నారు. ప్రాణవాయువు అవసరాలు తీర్చేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో రోజుకు దాదాపు 600  టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతున్నప్పటికీ.. రోడ్డు మార్గాల ద్వారానే తమిళనాడు, ఒడిశా నుంచి సరఫరా అవుతోంది. తాజాగా రవాణా సమయాన్ని తగ్గించేలా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు రైల్వేశాఖ సమ్మతించింది.

ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీ విషయంలో ఏపీ గణనీయమైన పురోగతి సాధించిందని, రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని ఆక్సిజన్‌ సేకరణ, సరఫరా పర్యవేక్షణ అధికారి కృష్ణబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయడంతోపాటు, తదుపరి చర్యలవల్ల ఆక్సిజన్‌ సరఫరా వేగవంతమైందన్నారు. రాష్ట్రానికి కొత్తగా కేంద్రం మరో 3 ఐఎస్‌వో ట్యాంకులను కేటాయించిందని, మొత్తం 6 ఆక్సిజన్‌ ట్యాంకులతో 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి వస్తోందన్నారు. ఎల్లుండికి 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేకరైలు కృష్ణపట్నం చేరుతుందన్నారు. తాజా మూడు ఐఎస్‌వో ట్యాంకులతో కలిపి రాష్ట్రానికి 6 ట్యాకులు అవుతాయని, ఒక్కో ప్రత్యేకరైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్‌ సరఫరాకు ప్రణాళిక రచిస్తున్నామని కృష్ణబాబు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని