ఇప్పుడు.. పెయింట్‌ మరకల‌ వంతు..!

తాజా వార్తలు

Published : 14/10/2020 23:57 IST

ఇప్పుడు.. పెయింట్‌ మరకల‌ వంతు..!

(ఫొటో: రాల్ఫ్‌ లొరెన్‌ వెబ్‌సైట్‌ స్ర్కీన్‌షాట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల గుచ్చి కంపెనీ పచ్చగడ్డి మరకలు అంటినట్లుగా ఉండే జీన్స్‌ప్యాంట్లను అమ్మడం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహా దుస్తులను మరో కంపెనీ ఆన్‌లైన్‌లో అమ్ముతోంది. రాల్ఫ్‌ లొరెన్‌ అనే దుస్తుల సంస్థ పెయింట్ మరకలు అంటినట్లుగా ఉండే బాయిలర్‌ సూట్‌ టైప్‌ దుస్తులను అమ్మకానికి పెట్టింది. వీటి ధర 620 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.58వేలు. జపనీస్‌ కాటన్‌తో తయారు చేసిన ఈ జీన్స్‌ దుస్తుల్లో అక్కడక్కడ పెయింట్‌ మరకలు, మోకాళ్ల వద్ద మట్టి అంటుకున్నట్లుగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాగానే ఈ దుస్తుల ఫొటోలను నెటిజన్లు సోషల్‌మీడియాలో పెట్టి వైరల్‌ చేస్తున్నారు. ఇలాంటి దుస్తులు ఇంత ఖరీదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని