బిర్యానీ కోసం కిలోమీటర్ల మేర బారులా!

తాజా వార్తలు

Published : 12/10/2020 01:07 IST

బిర్యానీ కోసం కిలోమీటర్ల మేర బారులా!

బెంగళూరు: ఎక్కడైనా ఉచిత వస్తువులు పంపిణీ చేస్తుంటేనో.. లేదా నూతన వస్త్రాలపై రాయితీలు ఇచ్చినప్పుడో దుకాణాల ముందు ప్రజలు బారులు తీరడం చూసుంటాం. కానీ కర్ణాటకలోని హోస్‌కోట్‌లో ఓ హోటల్‌ ముందు బిర్యానీ కోసం భోజన ప్రియులు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున 4గంటల నుంచి హోటల్‌  ముందు బిర్యానీ కోసం వరుసలో నిలబడుతున్నారు. అక్కడ క్యూలో ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడగా.. తాను తెల్లవారుజామున 4గంటలకు క్యూలో నిలబడగా ఉదయం ఆరున్నరకు బిర్యానీ తీసుకున్నట్లు చెప్పాడు. బిర్యానీ కోసం బారులు తీరిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ దృశ్యాన్ని చూసిన వారు ఇదేమి వైపరిత్యమంటూ విస్తుపోతున్నారు.  Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని