టెలీస్కోప్‌లో అరుంధతి.. వరుడి వినూత్న ఆలోచన!

తాజా వార్తలు

Updated : 26/07/2020 21:51 IST

టెలీస్కోప్‌లో అరుంధతి.. వరుడి వినూత్న ఆలోచన!

మేడిపల్లి (జగిత్యాల): వివాహ వేడుకల్లో వరుడు వధువుకు అరుంధతి నక్షత్రం చూపించడం సహజం. చాలామందికి నక్షత్రం కనిపించకపోయినా చూసినట్లుగా ఫొటోలు దిగుతుంటారు. కానీ, ఆ వరుడు టెలీస్కోప్‌ను ఉపయోగించి వధువుకు నిజంగానే నక్షత్రాన్ని చూపించాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో ఈ వినూత్న ఆలోచనకు బీజం పడింది. జాతీయస్థాయిలో భౌతిక శాస్త్రంలో 75వ ర్యాంకు పొందిన కడకుంట్ల అభయ్ రాజ్‌ దీనికి శ్రీకారం చుట్టారు.

కల్వకోటకు చెందిన గుండేటి శివానికి, రాయికల్‌కు చెందిన భౌతిక శాస్త్రం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అభయ్ రాజ్‌తో వివాహం జరిగింది. అభయరాజ్ రాయికల్ మండలం రామారావు పల్లిలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. భౌతికశాస్త్రంలో పలు సృజనాత్మక ఆవిష్కరణలకు ఆయన నాంది పలికారు. తన పాఠశాలలో విద్యార్థులతో భౌతిక శాస్త్రంలో పలు అంశాలను రూపొందించగా.. రెండుసార్లు దక్షిణ భారత స్థాయి సైన్స్‌ఫేర్‌లో చెన్నై, బెంగళూరులో బహుమతులు సాధించారు. ‘ఈనాడు’ హాయ్ బుజ్జి నిర్వహించిన వృక్ష మిత్ర పోటీల్లోనూ ఆయన విద్యార్థులు బహుమతులు పొందారు. 

పెళ్లి వేడుకల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు కేవలం తంతుగా కొనసాగుతుండగా.. అభయ్ రాజ్ మాత్రం టెలిస్కోప్ లెన్స్ సాయంతో నిజమైన అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు చెప్పారు. చీకట్లో నక్షత్రాలు కనిపించడం సహజమని, కానీ మధ్యాహ్నం టెలిస్కోప్ సాయంతో అరుంధతి నక్షత్రం చూపించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలో అరుంధతి నక్షత్రాన్ని వరుడు అభయ్ రాజ్ టెలిస్కోప్ ద్వారా చూపించిన విధానం అక్కడి వారిని ఆకట్టుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని