ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు.. కొవిడ్‌ క్రాష్‌ కోర్సు

తాజా వార్తలు

Published : 16/06/2021 21:20 IST

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు.. కొవిడ్‌ క్రాష్‌ కోర్సు

ఈ నెల 18న ప్రారంభించనున్న ప్రధాని.. లక్ష మందికి శిక్షణ

దిల్లీ: కొవిడ్‌ మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల కొరత తీర్చేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య రంగంలో ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కొవిడ్ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు శిక్షణ ఇచ్చేందుకు క్రాష్‌ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్ యోజన పథకం 3.0 కింద ‘కస్టమైజ్డ్‌ క్రాష్‌ కోర్స్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కొవిడ్‌ 19 ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌’ పేరిట సుమారు లక్ష మందికి పైగా శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం రూ.276 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. హోంకేర్‌, ప్రాథమిక, అడ్వాన్స్‌, అత్యవసర సహాయం, శాంపిల్‌ సేకరణ, వైద్య పరికరాల నిర్వహణ లాంటి ఆరు అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించింది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ సైతం 5 వేల మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని