ఎస్‌ఐకు కోపమొచ్చింది.. గంపలను తన్నాడు..

తాజా వార్తలు

Updated : 20/06/2021 18:37 IST

ఎస్‌ఐకు కోపమొచ్చింది.. గంపలను తన్నాడు..

రాయచూర్‌: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన చిరువ్యాపారులపై రాయచూర్‌లో ఓ ఎస్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచూర్ పరిసర గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు సదర్‌బజార్‌లో పటేల్ రోడ్డు నుంచి చంద్రమౌళీశ్వర సర్కిల్  వరకూ రహదారి పక్కన కూరగాయలు విక్రయించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కూరగాయలు అమ్ముతున్నారని ఎస్ఐ వారిపై మండిపడ్డారు. కూరగాయలను కాలితో తన్నుతూ చెల్లాచెదురు చేశారు. వారందరినీ అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఎస్ఐ తీరుపైవ్యాపారులు ఆవేదన వ్యక్తంచేయగా.. కూరగాయలను కాలితో తన్నడాన్ని స్థానికులు తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని