కుమార్తె పెళ్లిలో కేంద్రమంత్రి డ్యాన్స్‌.. రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి

తాజా వార్తలు

Published : 03/09/2021 01:53 IST

కుమార్తె పెళ్లిలో కేంద్రమంత్రి డ్యాన్స్‌.. రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి

హుబ్లీ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. గురువారం కర్ణాటకలోని హుబ్లీ నగరంలో జరిగిన ఈ వివాహ విందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో పాటు పలు రంగాల ప్రముఖులు విచ్చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించి.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

భార్యతో కలిసి స్టెప్పులేసిన ప్రహ్లాద్‌ జోషీ..

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ తన సతీమణితో కలిసి డ్యాన్స్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన కుమార్తె వివాహ వేడుక బుధవారం రాత్రి హుబ్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన భార్యతో కలిసి ఓ కన్నడ పాత సినిమా పాటకు హుషారుగా స్టెప్పులు వేశారు. ఆయన డ్యాన్స్‌ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని