ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు

తాజా వార్తలు

Updated : 14/05/2021 11:45 IST

ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన్‌ పర్వదినాన్ని నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొంటున్నారు.   పలు ప్రాంతాల్లో  మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

మక్కామసీద్‌లో కేవలం ఐదుగురితో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పాతబస్తీలోని అన్ని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. మసీదుల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరించి లోపటికి ఎవరినీ అనుమతించలేదు. పాతబస్తీలో సీపీ అంజనీ కుమార్, అదనపు సీపీ చౌహాన్  పర్యటించారు. మక్కా మసీద్, చార్మినార్ ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు.

రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, డీజీపీ మహేందర్ రెడ్డి  తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని