Ratan Tata: రతన్‌ టాటాకు పియానో అంటే ఎంత ప్రేమో..!

తాజా వార్తలు

Published : 09/09/2021 01:34 IST

Ratan Tata: రతన్‌ టాటాకు పియానో అంటే ఎంత ప్రేమో..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రతన్‌ టాటా.. దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్త. గొప్ప మానవతావాది.. దాతృత్వం కలిగిన వ్యక్తి. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. అలాగే ఆయన తన వ్యక్తిగత విషయాలను తరచూ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటుంటారు. తాజాగా పియానో వాయిద్యంపై తనకున్న ప్రేమను చాటుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు. పియానో వాయిస్తున్నప్పుడు తీసిన ఫొటోను షేర్‌ చేశారు. చిన్నప్పుడు నేర్చుకున్న పియానోపై తనకింకా ఆకర్షణ పోలేదని ఎప్పటికైనా పియానో వాయించడం పూర్తిగా నేర్చుకుంటానని పేర్కొన్నారు.

‘‘చిన్నవయసులో పియానో వాయించడం కొంచెం నేర్చుకున్నాను. ఇప్పటికీ పియానో వాయించడం పూర్తిగా నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంది. నా పదవీ విరమణ తర్వాత ఓ గొప్ప పియానో టీచర్‌ను కలిశాను. కానీ.. రెండు చేతులతో పియానో వాయించడంపై శ్రద్ధ పెట్టలేకపోయాను. సమీప భవిష్యత్తులో మరోసారి పియానో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’’అని రతన్‌ టాటా ఫొటో కాప్షన్‌లో రాసుకొచ్చారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో రతన్‌ టాటా మాట్లాడుతూ.. ఓ విషయంలో చింతిస్తున్నట్లు తెలిపారు. ‘ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పొందిన నేను.. ఆర్కిటెక్ట్‌గా కెరీర్‌ కొనసాగించాలని భావించా. కానీ.. కుటుంబ నేపథ్యం నన్ను వ్యాపార రంగంలోకి తీసుకొచ్చింది.. ఆర్కిటెక్ట్‌గా కొనసాగకపోవడం పట్ల ఇప్పటికీ చింతిస్తున్నా’ అని చెప్పారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని