Delhi: చీరతో హోటల్‌కు వెళితే.. లోపలికి రావద్దన్నారు!

తాజా వార్తలు

Published : 23/09/2021 01:41 IST

Delhi: చీరతో హోటల్‌కు వెళితే.. లోపలికి రావద్దన్నారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనదేశంలో మహిళల సంప్రదాయ వస్త్రధారణ చీర.  పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో చీరను కట్టుకోవడానికే మహిళలు అధిక ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే, దిల్లీలోని ఓ రెస్టారెంట్‌ సిబ్బంది మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. చీర కట్టుకొని వెళ్లిన ఓ మహిళను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని ఓ వీడియోలో తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

అనితా చౌదరి అనే మహిళ దిల్లీలోని ఓ హోటల్‌కు చీర కట్టుకొని వెళ్లారు.  సిబ్బంది ఆమెను చూసి లోపలికి వెళ్లడానికి వీల్లేదని ఆమెతో వాగ్వాదానికి దిగారు. అప్పుడు జరుగుతున్న సంఘటనను ఆమె వీడియోలో చిత్రించి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘‘ఇది జాగ్రత్తగా వినండి.. దిల్లీలోని ఓ రెస్టారెంట్‌ చీరను స్మార్ట్‌ ఔట్‌ఫిట్‌ కాదని భావిస్తోంది. ఎంతగా చెప్పిన నన్ను  అనుమతించలేదు. ఇది దేశ సంప్రదాయానికి అవమానం కలిగించడమే’’ అని అనితా చౌదురి రాసుకొచ్చారు. అంతేకాకుండా దీనిపై ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ‘‘నేను భారతీయ సంస్కృతిని గౌరవిస్తాను. నాకు వస్త్రధారణలో చీర కట్టుకోవడమంటేనే ఇష్టం. చీరనే ఫ్యాషన్‌గా, అందమైన వస్త్రధారణగా నమ్ముతాను. కానీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చీరను అందమైన వస్త్రధారణగా భావించట్లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘స్మార్ట్‌ ఔట్‌ఫిట్‌ అనే దానికి నిర్వచనం చెప్పమని దేశ ప్రధాని, హోంమంత్రి, దిల్లీ సీఎం, పోలీసులను, జాతీయ మహిళా కమిషన్‌ను అడుగుతున్నాను.’’ అని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని