Corona: తెలంగాణ సచివాలయంలో ఆంక్షలు

తాజా వార్తలు

Published : 23/04/2021 15:06 IST

Corona: తెలంగాణ సచివాలయంలో ఆంక్షలు

హైదరాబాద్: కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సచివాలయంలోకి సాధారణ సందర్శకులకు అనుమతిని నిషేధించింది. సచివాలయంలో తాత్కాలిక పాసులు రద్దు చేసింది. సంబంధిత అధికారి అనుమతి ఉంటేనే సందర్శకులను అనుమతించనున్నట్లు తెలిపింది. అందులోనూ థర్మల్ స్క్రీనింగ్‌ చేశాకే సందర్శకులను లోనికి అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని