ఎన్‌సీఆర్‌ పరిధిలో నిర్మాణ సంస్థలపై వేటు!

తాజా వార్తలు

Published : 05/01/2021 02:20 IST

ఎన్‌సీఆర్‌ పరిధిలో నిర్మాణ సంస్థలపై వేటు!

దిల్లీ: దేశ రాజధాని పరిధిలో వాయు కాలుష్య నిబంధనల్ని ఉల్లంఘించిన పలు నిర్మాణ సంస్థలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిపి వాయు కాలుష్యానికి కారణమైన 12 సంస్థలపై రూ.1.59కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు వాతావరణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.  

‘దేశరాజధాని పరిధిలో గత నెల 24 నుంచి 31 వరకు నిబంధనలు ఉల్లంఘించిన కాలుష్యానికి కారకులైన వారిపై.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ ప్రత్యేక కమిటీలు మూడు వేల ప్రదేశాల్లో పరిశీలన జరిపగా.. 386 చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించాయి. వీటిలో.. 12 ప్రదేశాల్లో జరిగిన నిర్మాణాలు కాలుష్యాన్ని అత్యధికంగా పెంపొందించేలా ఉన్నందున జరిమానా విధించేందుకు దిల్లీ సహా పరిసర రాష్ట్రాల కాలుష్య మండళ్లకు సిఫారసు చేశాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి 12 చోట్ల జరిగిన ఉల్లంఘనలపై రూ.1.59 కోట్ల జరిమానా విధించి.. అన్ని చోట్ల వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన వాహనాలపై కూడా రూ.1.17 కోట్ల విధించింది’ అని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర వాతావరణశాఖ 224 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

గంగూలీకి యాంజియోప్లాస్టీ తర్వాత చేస్తాం

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని