సెలూన్‌ యజమాని వినూత్న ఆఫర్‌

తాజా వార్తలు

Updated : 21/06/2021 19:04 IST

సెలూన్‌ యజమాని వినూత్న ఆఫర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాను కట్టడిచేయడంలో టీకా కీలకమని నిపుణులు చెబుతున్నారు. కానీ టీకాపై వస్తున్న కొన్ని వదంతుల కారణంగా కొందరు టీకా తీసుకోవడానికి భయపడుతున్నారు. దీంతో పలువురు వినూత్నరీతుల్లో టీకా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా తమిళనాడుతోని ఓ సెలూన్ యజమాని వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ ఉన్న వాళ్లు తన సెలూన్‌లో క్షవరం చేయించుకుంటే 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తానని ప్రకటించాడు.

తమిళనాడులో మధురైలోని కార్తికేయన్‌ అనే సెలూన్‌ యజమాని ఈ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. కరోనా వ్యాక్సిన్ వేయించుకొని తన వద్దకు వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్‌తో హెయిర్ కట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచేందుకు తాను ఈ ఆఫర్ ఇచ్చానని కార్తికేయన్ తెలిపాడు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలన్నా, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలన్నా.. తప్పకుండా కరోనా టీకా వేయించుకోవాలని తన దగ్గరకు వచ్చే కస్టమర్లకు చెబుతున్నాడు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని