పరిషత్‌ ఎన్నికలు: ఎస్‌ఈసీ కౌంటర్ అఫిడవిట్‌ 

తాజా వార్తలు

Updated : 03/04/2021 17:46 IST

పరిషత్‌ ఎన్నికలు: ఎస్‌ఈసీ కౌంటర్ అఫిడవిట్‌ 

అమరావతి: పరిషత్‌ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు 45 పేజీల అఫిడవిట్‌ను కోర్టు ముందుంచింది. గతంలో నిలిచిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని వివరించింది. ఎన్నికలు సజావుగా సాగేలా ఆదేశాలివ్వాలని కోరింది.

ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని, పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది.అంతేకాకుండా సుప్రీం కోర్టు తీర్పుకు ఎస్‌ఈసీ తీరు విరుద్ధమని జనసేన స్పష్టం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు వెలువరించాల్సి ఉంది.

ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ల వాదనలు వినింది. రేపు ఎస్‌ఈసీ తరఫున వాదనలు వింటానని వెల్లడించిన ధర్మాసనం విచారణ రేపటికి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని