Viral: గాల్లో ఎగురుతూ.. చకచకా తరిగేశాడు..

తాజా వార్తలు

Published : 31/07/2021 01:06 IST

Viral: గాల్లో ఎగురుతూ.. చకచకా తరిగేశాడు..

 


 
అంకారా: కూరగాయలు తరిగేప్పుడు మనకు గాయాలు కాకుండా చూసుకుంటూ తరుగుతాం. అన్నీ ఒకే ఆకారంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ కోస్తుంటాం. కానీ, టర్కీకి చెందిన బురాక్‌ అనే చెఫ్ మాత్రం వంటల్లో ఆరితేరిన దిట్ట. కెమెరాకు స్మైల్ ఇస్తూనే.. రుచిగా వంటలు చేయగల నేర్పరి. అందుకే ఈసారి ఆకాశంలో ఎగురుతూ ఉల్లిపాయలను చకచకా తరిగేశారు. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఆ వీడియోలో బురాక్ ఒక పారామోటార్‌లో గాల్లో చక్కర్లు కొడుతున్నారు. అదే సమయంలో ఉల్లిపాయల్ని తీసుకొని, వాటివైపు చూడకుండా, వేగంగా కట్ చేశారు. గాల్లో ఎగురుతున్న ఉల్లిపాయలంటే మీకిష్టమా? అంటూ సరదాగా వ్యాఖ్యను జోడించారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. వారు కామెంట్ సెక్షన్‌లో తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఒకసారి దుబాయ్ రెస్టారెంట్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కూడా సర్‌ప్రైజ్ చేశారు. ఒక బ్రెడ్ ముక్కపై మీర్జా అని రాసి, ఆమె చేతికందించారు. 




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని