smriti irani: పెళ్లి గురించి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫన్నీ సలహా

తాజా వార్తలు

Published : 23/07/2021 16:04 IST

smriti irani: పెళ్లి గురించి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫన్నీ సలహా

జీవితానికి నిర్వచనం ఆమె ఏమని చెబుతారంటే..

దిల్లీ: నెటిజన్లను ఆలోచింపజేసే సందేశాలతో ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్‌ చేస్తుంటారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. గతంలో ‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ ’ అంటూ ఓ చిన్నారి మది కోరుకుంటున్న విషయాన్ని ఓ పవర్ ఫుల్‌ సందేశం ద్వారా వినిపించారామె. తాజాగా వివాహం, జీవితానికి సంబంధించిన ఫన్నీ సలహాలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్టు చేశారు. ఇక వివాహం విషయానికొస్తే.. ‘‘మీరు ఒక వ్యక్తిని పెళ్లాడే ముందు.. ఆ వ్యక్తితో స్లో ఇంటర్నెట్‌ కంప్యూటర్ ఇచ్చి దాని మీద పనిచేయమనండి.. తద్వారా ఆ వ్యక్తిలో సహనంతో పాటు ఆ సమయంలో ప్రవర్తించే తీరును పరీక్షించొచ్చు. ఆ పై ఒక అంచనాకు వచ్చి పెళ్లాడండి’’ అంటూ సరదాగా చెప్పారు.  చివర్లో.. జీవితం అనే పదానికి నిర్వచనమిస్తూ.. జీవితంలో కృషి చేయందే.. ఏదీ పర్‌ఫెక్ట్‌ కాదని.. ఇది ‘ఆంటీ అడ్వైజ్‌’ అంటూ సలహాఇచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని