కోటప్పకొండ ప్రభలపై ఆంక్షలు విధించలేదు: ఎస్పీ

తాజా వార్తలు

Published : 01/03/2021 01:22 IST

కోటప్పకొండ ప్రభలపై ఆంక్షలు విధించలేదు: ఎస్పీ

గుంటూరు: శివరాత్రిని పురస్కరించుకుని నరసరావుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దనే ఆంక్షలు విధించలేదని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభల ఏర్పాటు అనుమతిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఏటా సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసే ప్రభలపై ఆంక్షలు విధించలేదన్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని.. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రజలు తిరునాళ్లు జరుపుకోవచ్చని ఎస్పీ తెలిపారు. మతాచారాలకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని